బెంగళూరులో చికిత్సకు రావద్దు, 22 వేల మంది డాక్టర్ల సమ్మె ! | Oneindia Telugu

2017-11-15 41

All the OPDs in Bengaluru will be close from tomorrow morning at 8 am. More than 30 medical organizations have called for a strike to support doctors who are fasting in Belagavi.

బెంగళూరులో గురువారం ఉదయం 8 గంటల నుంచి అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీడీ సేవలు నిలిపి వేయాలని 30కి పైగా వైద్య సంఘాలు (డాక్టర్లు) నిర్ణయించాయి. బెంగళూరు నగరంలోని దాదాపు 6, 000 ఆసుపత్రుల్లో గురువారం ఉదయం నుంచి ఓపీడీ సేవలు నిలిచిపోనున్నాయి. బెళగావిలో వైద్యులు చేస్తున్న సమ్మెకు బెంగళూరులో దాదాపు 22 వేల మంది ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు మద్దతు ఇస్తున్నారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన వైద్య సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త చట్టం వలన ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా తయారౌతుందని అన్నారు.
వెంటనే ప్రభుత్వం అమలు చేసిన చట్టాన్ని రద్దు చెయ్యాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజామాన్యాలు, ప్రైవేటు ఆసుపత్రుల వైద్య సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లడం వీలుకాదని వైద్య సంఘాల ప్రతినిధులు తెలిపారు. బెంగళూరు నగరంలో చికిత్స చేయించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి, తమిళనాడులోని క్రిష్ణగిరి, ధర్మపురి, సేలం తదితర జిల్లాల నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో రోగులు వస్తుంటారు. బెంగళూరులో చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.